ప్రపంచంలోనే అతిచిన్న స్పూన్.. గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది.. ఇదిగో వీడియో!

  • పొడవు కేవలం 2 మిల్లీమీటర్లు
  • బియ్యపు గింజపైనా పెట్టగలిగినంత చిన్న స్పూన్
  • చెక్కతో రూపొందించిన జైపూర్ కళాకారుడు ప్రజాపతి
రికార్డులకు కేరాఫ్ అడ్రస్.. గిన్నిస్ బుక్. ఇందులో పాత రికార్డులు చెరిగిపోయి.. కొత్త రికార్డులు చేరుతుంటాయి. అందుకే ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కళాకారుడు నవరతన్ ప్రజాపతి మూర్తీకర్ కూడా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఇంతకీ అతడేం చేశాడో తెలుసా? ఓ చిన్న స్పూన్!! అంతేనా అనుకోకండి.. అందులోనే ఉంది ప్రత్యేకతంతా. 

‘చిన్న’ పనే కానీ.. ఎంతో నైపుణ్యంతో.. మరెంతో శ్రద్ధతో చిట్టి స్పూన్ ను చెక్కతో రూపొందించాడు ప్రజాపతి. అది కూడా ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్. ఎంత చిన్నదీ అంటే.. బియ్యపు గింజ మీద పెట్టినా నిలబడగలిగేంత!!

దీన్నిచూసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు రికార్డుల్లోకి ఎక్కించేశారు. పనిలో పనిగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంతకీ ఆ స్పూన్ పొడవు ఎంతో చెప్పలేదు కదూ.. కేవలం 2 మిల్లీమీటర్లు. ‘దానితో ఎలా తినాలబ్బా’ అని ఆలోచించకండి.. అది కేవలం గిన్నిస్ రికార్డు కోసమే ప్రజాపతి రూపొందించిన స్పూన్. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియో మీరూ చూసేయండి.


More Telugu News