మహిళల పునరుత్పత్తి అవయవం పట్ల అపోహలు.. వాస్తవాలు
- బరువుకు, గర్భధారణకు మధ్య సంబంధం నిజమే
- నెలవారీ రుతుస్రావం సమయంలోనూ గర్భధారణ అవకాశాలు
- గర్భనిరోధక మాత్రలు సురక్షితమే
నేడు మనం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. టెక్నాలజీ, ఔషధాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అదే సమయంలో జననేంద్రియాలు, పునరుత్పత్తి అవయవం, లైంగిక జ్ఞానం తక్కువగా ఉంటోంది. వీటి గురించి పాఠ్యాంశాల్లో సమాచారం ఉండదు. విడిగా ఎవరూ పెద్దగా చర్చించరు. దీంతో నిజాల కంటే అపోహలు ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి.
గర్భధారణకు బరువుకు లింక్?
అధిక బరువుతో వున్నా, బరువు తక్కువగా వున్నా గర్భం ధరించలేరని చెబుతుంటారు. ఇలా అసహజ బరువు సంతాన సాఫల్యత అవకాశాలపై ప్రభావం చూపిస్తుందనేది నిజమే. కానీ, అసలు గర్భం ధరించకుండా అడ్డుపడదు. గర్భం ధరించే అవకాశాలు వీరికి కూడా ఉంటాయి. కానీ, గర్భం దాల్చిన తర్వాత ఫలితాలు వేరేగా (గర్భం కోల్పోవడం తదితర సమస్యలు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కనుక బరువును నియంత్రణలో పెట్టుకోవడమే మంచిది.
గర్భనిరోధక మాత్రలతో కేన్సర్ ముప్పు?
ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తుంటారని అంచనా. కానీ, ఇలా వాడుతున్న వారికి కేన్సర్ వస్తుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ కూడా ఇంత వరకు లభించలేదు. పైగా గర్భనిరోధక మాత్రలను తీసుకునే వారికి ఒవేరియన్, యుటరిన్ కేన్సర్ రిస్క్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
రుతుక్రమంలో గర్భం రాదు?
ఇది నిజం కాదు. మహిళలు రుతుక్రమం (మెనుస్ట్రేషన్) సమయంలోనూ గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అండాశయం నుంచే అండాలు విడుదల అవుతాయి. పీరియడ్స్ సమయంలోనూ రక్తస్రావం అక్కడి నుంచే విడుదల అవుతుంది. నెలవారీ పీరియడ్స్ సమయంలో అండాలు విడుదల అవుతాయి. కనుక ఆ సమయంలో లైంగిక చర్యతో గర్భధారణ అవకాశాలు ఉంటాయి. అంతేకాదు పీరియడ్స్ అయిన తర్వాత కూడా గర్భధారణ అవకాశాలు ఉంటాయి.