మెగాస్టార్ దగ్గరున్న ప్రత్యేకత అదే: కోన వెంకట్

  • ఈ నెల 13వ తేదీన విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
  • స్క్రీన్ ప్లేను అందించిన కోన వెంకట్ 
  • బాబీ పనితీరు పట్ల ప్రశంసలు 
  • మెగాస్టార్ అనుభవాన్ని గురించిన ప్రస్తావన
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' ఈ నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లేను అందించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఏ సినిమా అయినా కథతో కాదు .. ఒక నమ్మకంతో మొదలవుతుంది. అలా రూపొందిన సినిమానే 'వాల్తేరు వీరయ్య' అన్నారు. 

"బాబీ అంతా తనకే తెలుసునని అనుకోడు .. తాను చెప్పిందే కరెక్టు అనుకోడు .. ఆయన దగ్గర ఆ మంచి లక్షణం ఉంది. తాను భయపడుతూ .. మిగతావారిని భయపెడుతూ ఆయన వర్క్ చేస్తాడు. చేస్తున్న సినిమా పట్ల ఆ మాత్రం భయం ఉండాలి. కథను గురించి చిరంజీవిగారు డౌట్స్ అడుగుతారు .. ఆ డౌట్స్ ఆయన 150 సినిమాల అనుభవంలో నుంచి పుట్టినవని నేను బాబీతో అన్నాను. 

చిరంజీవి గారు అడిగిన ఒక ప్రశ్నను కరెక్ట్ చేసుకోకపోతే, అది రేపు థియేటర్స్ నుంచి వస్తుంది. అప్పుడు మనం దానిని కరెక్ట్ చేయలేము. అందువలన ముందుగానే ఆయన చెప్పినవి కరెక్ట్ చేద్దామనే నేను బాబీతో అనేవాడిని. ఆయన కూడా అందుకు పూర్తిగా సహకరిస్తాడు. ఇక చిరంజీవి గారు ప్రతీది అడుగుతారు .. కానీ తాను చెప్పినట్టుగా చేయవలసిందేనని ఎప్పుడూ పట్టుబట్టరు. అదే ఆయనలోని ప్రత్యేకత" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News