రెండో వన్డేలో భారత్ కు అదిరే ఆరంభం.. ఐదో బంతికే ఓపెనర్ ను బౌల్డ్ చేసిన షమీ
- తొలి మ్యాచ్ లో ఆడిన జట్లను కొనసాగిస్తున్న భారత్, న్యూజిలాండ్
- తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న రాయ్ పూర్
- ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియం
న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ టాస్ నెగ్గింది. తొలి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు మొగ్గు చూపిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సారి బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారత పేసర్ మహ్మద్ షమీ తొలి ఓవర్లోనే ఫలితం రాబట్టాడు. ఇన్నింగ్స్ ఐదో బాల్ కే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్ కు శుభారంభం అందించాడు.
మరోవైపు భారత్, న్యూజిలాండ్ హైదరాబాద్ లో ఆడిన తుది జట్లనే కొనసాగించాయి. ఒక్క మార్పు కూడా లేకుండా బరిలోకి దిగాయి. తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్ లో అద్భుతంగా పోరాడిన కివీస్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. ఇక, రాయ్ పూర్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. 60 వేల సీటింగ్ సామర్థ్యంతో కూడిన స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది.