అది ఫేక్ వీడియో... తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి
- తిరుమల క్షేత్రం ఏరియల్ ఫుటేజి వీడియో వైరల్
- తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదన్న టీటీడీ
- అది 3డీ ఇమేజి, గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందన్న ధర్మారెడ్డి
- టీటీడీపై బురదజల్లే ప్రయత్నమని విమర్శలు
తిరుమల క్షేత్రం ఏరియల్ ఫుటేజితో కూడిన ఓ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని అన్నారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని వెల్లడించారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని తెలిపారు.
బహుశా అది 3డీ ఇమేజి లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుండొచ్చని ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను తెరపైకి తీసుకురావడం టీటీడీపై బురదజల్లే ప్రయత్నమేనని అన్నారు.
బహుశా అది 3డీ ఇమేజి లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుండొచ్చని ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను తెరపైకి తీసుకురావడం టీటీడీపై బురదజల్లే ప్రయత్నమేనని అన్నారు.