అదరగొట్టిన భారత అమ్మాయిలు.. ముక్కోణపు సిరీస్ లో శుభారంభం

  • తొలి మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం
  • రాణించిన అమన్ జోత్, దీప్తి శర్మ
  • వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఈస్ట్ లండన్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 147/6 స్కోరు చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా (34 బంతుల్లో 35) సత్తా చాటినా.. కెప్టెన్ మంధాన (7), హర్లీన్ (8), జెమీమా (0), దేవికా వైద్య (9) నిరాశ పరిచారు. దాంతో, భారత్ ఓ దశలో 69/5తో కష్టాల్లో పడింది. 

అయితే, దీప్తి శర్మ (23 బంతుల్లో 33), అమంజోత్ కౌర్ (30 బంతుల్లో 41) ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు మంచి స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. సున్ లూస్ (29), చ్లోయె ట్రైన్ (26), మరిజానె కాప్ (22) పోరాడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, దేవిక రెండు వికెట్లతో సత్తా చాటారు. అమన్ జోత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


More Telugu News