స్మార్ట్ ఫోన్ కనిపిస్తే కోతులైనా అతుక్కుపోవాల్సిందే!

  • ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ చూపిస్తుంటే స్క్రోల్ చేస్తూ వీక్షించిన కోతులు
  • వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు
  • డిజిటల్ అక్షరాస్యత విజయానికి నిదర్శనం అని వ్యాఖ్య
ఖాళీగా ఉంటే స్మార్ట్ ఫోన్ ను ఎంత సమయం పాటు అయినా అలా చూస్తూనే ఉంటాం. నేడు చిన్నారులు సైతం స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ ను చూస్తే కోతులు మాత్రం ఊరుకుంటాయా..? కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియో చూస్తే ఇది తెలుస్తుంది. 

ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను చేత్తో పట్టుకుని కోతులకు చూపిస్తుంటే.. అవి చేతులతో స్క్రోల్ చేస్తూ ఆసక్తిగా చూస్తున్నాయి. వీటికి తల్లికోతి తోడైంది. అది కూడా ఫోన్ దగ్గరగా వచ్చి చూస్తోంది. ‘‘డిజిటల్ అక్షరాస్యత అవగాహన ఎంత విజయం సాధించిందో చూడండి. ఊహించని స్థాయికి చేరింది’’ అని కిరణ్ రిజుజు ఈ వీడియోని పోస్ట్ చేసి ట్వీట్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.21 లక్షల మంది చూశారు. దీనికి ఓ వ్యక్తి బీజేపీ ఐటీ సెల్ పని చేస్తున్న మాదిరే ఈ వీడియో కూడా ఉందని కామెంట్ చేశాడు. అయితే, ఈ పనితో ఓ పెద్ద ప్రమాదం ఉంది. స్మార్ట్ ఫోన్ అభిరుచి కోతులకు అలవడిందంటే అప్పుడు మనుషుల చేతుల్లోని ఫోన్లు.. చెట్లపై కోతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు.


More Telugu News