ఉపాధ్యాయ సంఘాలతో ముగిసిన మంత్రి బొత్స సమావేశం
- టీచర్ల పదోన్నతులపై వివాదం
- ప్రమోషన్లపై ఉపాధ్యాయులతో చర్చించామన్న బొత్స
- 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు అవసరమన్న మంత్రి
- కొందరు సొంత ప్రయోజనాల కోసం కోర్టుకు వెళ్లారని వెల్లడి
ఏపీలో ఉపాధ్యాయుల పదోన్నతులపై ఏర్పడిన వివాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. దీనిపై మంత్రి బొత్స వివరాలు తెలిపారు.
ప్రమోషన్లపై ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించామని వెల్లడించారు. 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. అందుకోసం 12 వేల మంది సబ్జెక్టు టీచర్లు అవసరమవుతారని తేలిందని బొత్స పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఉపాధ్యాయ సంఘం నేతలు సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ జీవోపై కోర్టుకు వెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంపైనా బొత్స స్పందించారు. సూర్యనారాయణ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని, ఎవరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు.