ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ ను కారుతో కొద్దిదూరం లాక్కెళ్లిన క్యాబ్ డ్రైవర్
- ఢిల్లీ ఎయిమ్స్ కు దగ్గర్లో గురువారం తెల్లవారుజామున ఘటన
- తాగిన మత్తులో నిందితుడు హరీశ్ చంద్ర ఘాతుకం
- అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు
మహిళల రక్షణను పరిరక్షించి, పర్యవేక్షించే మహిళా కమిషన్ చైర్ పర్సన్ కే వేధింపులు ఎదురయ్యాయి. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తో ఓ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా కారుతో 10 నుంచి 15 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ గేట్ 2 దగ్గర గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని హరీశ్ చంద్ర (47)గా గుర్తించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తేల్చారు.
‘‘ఫుట్ పాత్ పై స్వాతి తన టీమ్ తో కలిసి నిలబడ్డారు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన హరీశ్ చంద్ర.. తన కారులో కూర్చోవాలని స్వాతి మలివాల్ ను అడిగాడు. దీంతో అతడిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్వాతి చెయ్యి కారులో ఉండగానే విండో గ్లాస్ నూ అతడు మూసేశాడు. అలానే కొద్దిదూరం కారును నడిపి ఆమెను లాక్కెళ్లాడు’’ అని పోలీసులు చెప్పారు. నిందితుడిపై 323, 341, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.