‘వాల్తేరు వీరయ్య’ ప్రభంజనం.. ఆరు రోజుల్లోనే రూ. 157 కోట్ల వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 121.35 కోట్ల గ్రాస్
- అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్కు దాటిన చిత్రం
- ఈ వారంతంలో 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం
మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ సినిమా సత్తా చాటుతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ తెరకెక్కించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాంతో, చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంకా దూసుకుపోతోంది.
ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 157.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 121.35 కోట్లు వచ్చాయి. అమెరికాలోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ల (రూ.16 కోట్లు) మార్కెట్ అందుకుంది. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుత జోరు చూస్తుంటే ఈ వారంతంలోనే మెగాస్టార్ చిత్రం రూ. 200 కోట్ల మార్కు దాటేలా ఉంది.