ఏపీ ప్రభుత్వ జీవో నెం.1పై రేపు సుప్రీంకోర్టులో విచారణ
- రోడ్లపై సభలు, ర్యాలీలపై జీవో తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- హైకోర్టును ఆశ్రయించిన సీపీఐ రామకృష్ణ
- ఈ నెల 23 వరకు జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
- సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 వివాదాస్పదం కావడం తెలిసిందే. చీకటి జీవో అంటూ విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, ఆ జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ సర్కారు అభ్యర్థనపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం... ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిపేందుకు నిర్ణయించింది. అటు, జీవో నెం.1పై ఏపీ హైకోర్టులో జనవరి 23న విచారణ జరగనుంది.