త్వరలో వైజాగ్ లో బీఆర్ఎస్ సభ.. ఏపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయి: తోట చంద్రశేఖర్
- పెద్ద పెద్ద లీడర్లు తమను సంప్రదిస్తున్నారన్న ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు
- ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న బీఆర్ఎస్
- కేజ్రీవాల్, పినరయి, భగ్ వంత్, అఖిలేష్ , డి. రాజా హాజరు
జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్ వంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సభ కోసం రాష్ట్రానికి వచ్చారు.
బీఆర్ఎస్ ఈ సభను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ సభ తర్వాత బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. ఇప్పటికే చేరికలు ఊపందుకున్నాయని అన్నారు. తమ పార్టీలోకి వచ్చేందుకు పెద్ద పెద్ద లీడర్లు తమను సంప్రదిస్తున్నారని తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ మొట్టమొదటి సభ వైజాగ్ లో ఉండే అవకాశం ఉందన్నారు.