ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్: మంత్రి గుడివాడ అమర్నాథ్
- ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న అమర్నాథ్
- అన్ని రాష్ట్రాల కంటే ఏపీ జీడీపీనే ఎక్కువని వెల్లడి
- ఏపీ నుంచి రూ.1.50 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని వివరణ
ఏపీ అభివృద్ధిపై ఆ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ అని తెలిపారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ జీడీపీ 11.43 శాతం ఏపీలోనే ఉందని వెల్లడించారు. ఏపీ నుంచి దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని గుడివాడ అమర్నాథ్ వివరించారు.
గతేడాది అక్టోబరు 31 నాటికే రాష్ట్రం నుంచి దాదాపు రూ.97 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని, అదే సమయంలో తెలంగాణ నుంచి రూ.55 వేల కోట్ల ఎగుమతులు మాత్రమే జరిగాయని తెలిపారు.
గతేడాది అక్టోబరు 31 నాటికే రాష్ట్రం నుంచి దాదాపు రూ.97 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని, అదే సమయంలో తెలంగాణ నుంచి రూ.55 వేల కోట్ల ఎగుమతులు మాత్రమే జరిగాయని తెలిపారు.