రైల్వేలో ఈ సదుపాయం ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా?

  • రైలు రద్దయితే ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు
  • నామమాత్రంగా రూ.20 లకే అన్ని వసతులు ఉన్న గది
  • 48 గంటల పాటు గదిని ఉపయోగించుకునే అవకాశం
భారతీయ రైల్వే తన ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలందిస్తుంది. ఇందులో కొన్ని సేవల గురించి చాలామందికి తెలియదు. అదే రైల్వే వెయిటింగ్ రూమ్.. స్టేషన్ లో ఉండే వెయిటింగ్ హాల్ లో రైలు వచ్చే వరకు వేచి ఉండొచ్చు. అదేవిధంగా ఏదైనా కారణంతో చివరి క్షణాలలో రైలును రద్దు చేసిన, రీ షెడ్యూల్ చేసిన సందర్భాల్లో వేచి ఉండేందుకు గదులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం ఉంది.

ఈ వెయిటింగ్ రూమ్ లకు రైల్వే శాఖ నామమాత్రంగా అద్దె వసూలు చేస్తుంది. అంటే.. రూ.20, రూ.40 చొప్పున చెల్లించి ఈ గదుల్లో గరిష్ఠంగా 48 గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే, రైలును రద్దు చేసినపుడు కానీ రీ షెడ్యూల్ చేసినపుడు కానీ ఆయా రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే రైల్వే శాఖ ఈ సదుపాయం కల్పిస్తోంది. రైల్వే వెబ్ సైట్ ద్వారా ఈ గదులను బుక్ చేసుకోవచ్చు.


More Telugu News