ఒకే కారు పట్టే మార్గంలో దూసుకుపోయిన రెండో కారు.. చూస్తే ఔరా అనాల్సిందే..!

  • నది వంతెనపైకి ఒకేసారి రెండు కార్లు
  • పట్టే మార్గం లేకపోవడంతో సాహసోపేత మార్గాన్ని ఎంచుకున్న కారు డ్రైవర్
  • వంతెన పిట్టగోడపై కారును ఎక్కించి ముందుకు వెళ్లిపోయిన సాహసికుడు
ఒక నదిపై వంతెన. ఈ వంతెనపై ఏక కాలంలో ఒకే కారు వెళ్లగలదు. కానీ, అనుకోకుండా రెండు ఎస్ యూవీలు ఒకేసారి వంతెనపైకి వచ్చాయి. అప్పుడు ఏంటి మార్గం.. ఏదో ఒక కారు వెనక్కి వెళితే కానీ, ముందున్న కారు వెళ్లడానికి ఉండదు. కానీ వెనక్కి వెళ్లేందుకు ఆ వంతెన పొడవు పెద్దగా ఉంటే ఏం చేయాలి..?

ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక కారు అదే వంతెనపై  రెయిలింగ్ వరకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆగిపోగా.. మరో కారు డ్రైవర్ యుక్తిని ప్రదర్శించాడు. రివర్స్ వెళ్లకుండా.. సాహసోపేత మార్గాన్ని ఎంచుకున్నాడు. కారు ఒకవైపు రెండు టైర్లను వంతెన రక్షణ గోడను ఎక్కించాడు. మరోవైపు రెండు టైర్లు వంతెనపై ఉన్నాయి. అలా బల్లపరుపుగా కారును నిదానంగా ముందుకు పోనిచ్చాడు. కారును దాటగానే నిదానంగా వంతెన పిట్టగోడపై నుంచి రెండు టైర్లను కిందకు దించేసి ముందుకు సాగిపోయాడు. 

దీనికి ధైర్యమే కాదు, డ్రైవింగ్ నైపుణ్యాలు కూడా అవసరం. ఇక్కడ వంతెన మరీ పొడవు ఏమీ లేదు. ఒక కారు రివర్స్ తీసుకుని వంతెన దిగి మార్గం ఇస్తే, ముందున్న కారును వెళ్లిపోతుంది. కానీ, డ్రైవింగ్ నైపుణ్యాలు, గుండె నిండా ధైర్యం ఉండడంతో ఈ కారు డ్రైవర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు.


More Telugu News