ఆ మూడు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల నగారా!
- త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో అసెంబ్లీ ఎన్నికలు
- ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ
- ఈ ఏడాదిలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు అంతా సిద్ధమైందని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ గడువు మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఏయే తేదీన ఎన్నికలు నిర్వహించేది ప్రకటించేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నామినేషన్ల నుంచి ఫలితాల ప్రకటన వరకు వివరాలను ఈసీ వెల్లడించనుంది. కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల తర్వాత కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణలలో కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.