అప్పట్లో ఎయిర్ హోస్టెస్ గా నా జీతం ఎంతంటే ..!: కాంచన
- నిన్నటి తరం అందాల తారగా వెలిగిన కాంచన
- అప్పట్లోనే ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన నటి
- ఎంతోమంది ప్రపోజ్ చేశారని వెల్లడి
- ఆస్తుల కోసం పోరాడి అలసిపోయానని చెప్పిన కాంచన
కాంచన .. తెలుగు తెరపై 60 .. 70వ దశకాలలో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన అందాల తార. అప్పట్లోనే ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తూ .. ఆ వైపు నుంచి సినిమాల దిశాగా ఆమె అడుగులు వేశారు. ఆనాటి స్టార్ హీరోలందరితోను కలిసి నటించారు. మోడ్రన్ లుక్ తో అప్పట్లోనే జోరైన .. హుషారైన పాత్రలను చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
అలాంటి కాంచన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నేను తమిళనాడులో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేదానిని. ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ముందు ఉండేదానిని. మా నాన్న అప్పుల్లో ఉన్నారనే విషయం అర్థం కావడానికి నాకు కొంత సమయం పట్టింది. ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేశాను. అప్పట్లో నెలకి 600 జీతం ఇచ్చేవారు. అదే చాలా ఎక్కువగా అనిపించేది. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు" అన్నారు.
సినిమాల్లో మోడ్రన్ కేరక్టర్స్ ఎక్కువగా చేసినా, బయట చాలా సంప్రదాయ బద్ధంగా ఉండేదానిని. దాంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద పెద్ద వారు ముందుకు వచ్చారు. కానీ మా అమ్మ పిన్నికొడుకు ఒకడు ఉండేవాడు .. వాడు ఎందుకూ పనికిరాడు. అమ్మానాన్నలు అతను చెప్పినట్టు ఆడేవారు. నా ఆస్తులు నాకు కాకుండా పోవడానికి అతనే కారకుడు. కోర్టు ద్వారా పోరాడటానికి జీవితమంతా సరిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.