ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన సిస్టర్ అండ్రే కన్నుమూత

  • 1904 ఫిబ్రవరి 11న పుట్టిన సిస్టర్ అండ్రే
  • 118 ఏళ్ల వయసులో మంగళవారం మృతి
  • క్రైస్తవ సన్యాసిగా నర్సింగ్ హోమ్ లో సేవలందించిన అండ్రే
ప్రపంచంలో సుదీర్ఘకాలం జీవించి ఉన్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఫ్రెంచ్ మహిళ సిస్టర్ అండ్రే మంగళవారం కన్నుమూశారు. ఆమె వయసు 118 సంవత్సరాలు. అండ్రే అసలు పేరు లూసిలి రాండన్.. టౌలన్ లోని తన నర్సింగ్ హోమ్ లో రాండన్ మంగళవారం నిద్రలోనే చనిపోయారని హోమ్ అధికార ప్రతినిధి చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధానికి దశాబ్దం ముందు అంటే 1904 ఫిబ్రవరి 11న ఫ్రాన్స్ లోని అలెస్ నగరంలో జన్మించిన అండ్రే.. క్రైస్తవ సన్యాసిగా మారి తన జీవితాన్ని జీసస్ సేవకు అంకితం చేశారు.

అండ్రే ఇప్పటి వరకు మార్సెల్లీ సిటీలోని ఓ నర్సింగ్ హోమ్ లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవిస్తున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన అండ్రే.. మంగళవారం మరణించడం బాధాకరమని నర్సింగ్ హోమ్ ప్రతినిధి చెప్పారు. ‘సిస్టర్ అండ్రే మృతి బాధాకరమే.. అయినా, స్వర్గంలోని తన సోదరుడిని కలుసుకోవాలన్న అండ్రే కోరిక నెరవేరింది’ అంటూ నర్సింగ్ హోమ్ సంతాప ప్రకటన విడుదల చేసింది.


More Telugu News