పాదయాత్రలు చేస్తే ఒరిగేదేముంటుంది.. బరువు తగ్గడం తప్ప!: ఏపీ మంత్రి రోజా సెటైర్
- విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు
- ముగింపు కార్యక్రమానికి హాజరైన రోజా
- పవన్, లోకేశ్‌లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి
పాదయాత్రలు చేయడం వల్ల బరువు తగ్గడం తప్ప ఒరిగేదేమీ ఉండదని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో మూడు రోజులపాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘మన గ్రామం’ స్టాల్స్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వారాహితో వచ్చినా, నారా లోకేశ్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పాదయాత్రలు చేస్తే బరువు తగ్గుతారు తప్పితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అబివృద్ధి చేస్తున్నట్టు చెప్పిన రోజా.. తమ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం జీవో కూడా తీసుకొచ్చినట్టు చెప్పారు. భవానీ ద్వీపంలో తొలిసారి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు నిర్వహించినట్టు మంత్రి గుర్తు చేశారు.