కనుమ సందర్భంగా గోవులకు స్వయంగా తినిపించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
- పశుపక్ష్యాదులను ఆరాధించే పండుగ కనుమ
- తన వ్యవసాయక్షేత్రంలో కనుమ వేడుక నిర్వహించిన పవన్
- ఆవులకు, దూడలకు అరటిపళ్లు అందించిన వైనం
- ఫొటోలను పంచుకున్న జనసేన పార్టీ
కనుమ పండుగను పశుపక్ష్యాదులను ఆరాధించే పవిత్ర పర్వదినంగా భావిస్తారు. రైతు పొలం దున్నడం, విత్తడం, పండించిన ధాన్యం ఇంటికి చేర్చడం వరకు పశువుల సహకారం ఉంటుంది. యజమానులకు తోడ్పాటునందించే మూగజీవాలను కనుమ నాడు పూజించడం ఆనవాయతీ. కనుమ నాడు ప్రతి ఇంటా పశువులను అందంగా ముస్తాబు చేసి, ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తారు.
ఇవాళ కనుమ పండుగను పురస్కరించుకుని జనసేనాని పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ వేడుకలు నిర్వహించారు. కనుమ వేడుక నేపథ్యంలో వ్యవసాయక్షేత్రంలోని గోవులకు పవన్ అరటిపళ్లు స్వయంగా తినిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.