హైదరాబాదులో విషాద ఘటన... కస్టమర్ పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

  • బంజారాహిల్స్ లో డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన రిజ్వాన్
  • తలుపు నెట్టడంతో దూసుకొచ్చిన జర్మన్ షెపర్డ్ కుక్క
  • తప్పించుకోబోయి మూడో అంతస్తు నుంచి కిందకు పడిపోయిన వైనం
  • నిమ్స్ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి
హైదరాబాదులో స్విగ్గీ డెలివరీ బాయ్ దురదృష్టకర రీతిలో మృతి చెందాడు. డెలివరీ ఇవ్వడానికి వెళ్లి కస్టమర్ కు చెందిన పెంపుడు కుక్క తరమడంతో భవనం పైనుంచి పడి ప్రాణాలు విడిచాడు.

23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ స్విగ్గీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న బంజారాహిల్స్ లోని లుంబిని రాక్ కాజిల్ అపార్ట్ మెంట్స్ లో డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. కస్టమర్ ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి తలుపు నెట్టాడు. ఇంటికి కొత్తవ్యక్తి రావడంతో అక్కడున్న జర్మన్ షెపర్డ్ కుక్క అరుస్తూ మీదికి దూకింది. దాంతో భయపడిపోయిన రిజ్వాన్ దాన్నుంచి తప్పించుకునేందుకు పరుగు తీశాడు. 

ఈ క్రమంలో మూడో అంతస్తు రెయిలింగ్ మీదుగా కిందపడిపోయాడు. తీవ్రగాయాలపాలైన ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ ని కుక్క యజమాని నిమ్స్ కు తరలించాడు. చికిత్స పొందుతూ రిజ్వాన్ మృతి చెందినట్టు అతడి సోదరుడు వెల్లడించాడు. తమకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.


More Telugu News