నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- వారాన్ని నష్టాలతో ప్రారంభించిన మార్కెట్లు
- 168 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 61 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయినప్పటికీ... ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి తలొగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు కోల్పోయి 60,092కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 17,894 వద్ద స్థిరపడింది. బేసిక్ మెటీరియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.14%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.48%), ఇన్ఫోసిస్ (1.45%), విప్రో ( 1.27%), టీసీఎస్ (1.06%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.26%), ఎన్టీపీసీ (-1.16%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.97%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.97%).