కూకట్ పల్లి నుంచి పోటీ చేయబోతున్నారనే వార్తలపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందన
- ఖమ్మంను తాను ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నానన్న అజయ్
- ఖమ్మంలో ఒక పనికిమాలిన అబద్ధాల బ్యాచ్ ఉందని వ్యాఖ్య
- తప్పుడు ప్రచారం చేసే వారిని పెకిలించి వేస్తానని వ్యాఖ్య
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పువ్వాడ స్పందించారు. ఖమ్మంలో ఒక పనికిమాలిన బ్యాచ్ ఉందని ఆయన అన్నారు. బీజేపీలో ఉన్న విధంగానే బీఆర్ఎస్ లో కూడా ఒక అబద్ధాల బ్యాచ్ ఉందని చెప్పారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం మినహా మరో పని ఉండదని అన్నారు. తన వెనకున్న సైన్యాన్ని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వాళ్లను పెకిలించి వేస్తానని చెప్పారు.
ఖమ్మంను తాను ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నానని... ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తల గుండెల్లో తాను ఉన్నానని... అలాంటప్పుడు వీరిని వదిలేసి తాను కూకట్ పల్లికి ఎందుకు వెళ్తానని చెప్పారు. నియోజకవర్గంలో తామంతా ఐక్యంగా ఉంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరగబోతోంది. ఈ తరుణంలో పువ్వాడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.