అప్పట్లో సినిమాల్లో నిలదొక్కుకోవడం ఇప్పుడంత తేలిక కాదు: డబ్బింగ్ జానకి
- 'భూకైలాస్' ద్వారా పరిచయమైన డబ్బింగ్ జానకి
- వివిధ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలు
- నటిగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని వెల్లడి
- అందుకే తన పిల్లలను ఇటు వైపు రానీయలేదని వ్యాఖ్య
నిన్నటితరం ప్రేక్షకులకు డబ్బింగ్ జానకి తెలియకుండా ఉండరు. వందల సినిమాల్లో ఆమె నటించినప్పటికీ, డబ్బింగ్ పరంగా వచ్చిన మరింత పేరు కారణంగానే అంతా డబ్బింగ్ జానకి అని పిలిచేవారు. ఇక ఆ సమయంలో జానకి అనే పేరుతో సినిమాల్లో మరికొంతమంది ఉండటం వలన కూడా, ఈ జానకి పేరు ముందు డబ్బింగ్ చేర్చి పిలవడం మొదలైంది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " 1958లో 'భూకైలాస్'తో నేను పరిచయమయ్యాను. వివిధ భాషల్లో కలుపుకుని వెయ్యికి పైగా సినిమాల్లో చేశాను. అప్పట్లో సినిమాల్లో నిలదొక్కుకోవడం ఇప్పుడంత తేలిక కాదు. ఎన్నో రకాల టెస్టులు చేసేవారు. తాము అనుకున్న పాత్రకి ఏ మాత్రం కాస్త అటు ఇటుగా ఉన్నా పక్కన పెట్టేసేవారు. గ్రూప్ డాన్సర్స్ గా ఓ పది మంది కావాలంటే, పాతిక మందిని పిలిపించి ఫిల్టర్ చేసేవారు" అని అన్నారు.
"అంజలీదేవి .. భానుమతి వంటివారే ఎన్నో కష్టాలుపడి ఆ స్థాయికి వచ్చారు. నేను కూడా చిన్న చిన్న పాత్రలను వేస్తూ .. డబ్బింగులు చెప్పుకుంటూ .. నాటకాలు వేస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందువల్లనే నా పిల్లలుగానీ .. మనవళ్లుగాని ఇటువైపు రాకుండా చూసుకున్నాను. వాళ్లు మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.