మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు సొంతం చేసుకున్న రిలయన్స్ వయాకామ్.. ధర ఎంతంటే..!
- రూ. 951 కోట్లు పలికిన మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులు
- ఐదేళ్ల కాలానికి హక్కులు సొంతం చేసుకున్న వయాకామ్ 18
- ఒక్కో మ్యాచ్ కు రూ. 7.09 కోట్లు చెల్లించనున్న వయాకామ్
- ఈ మార్చిలో జరగనున్న మహిళల ఐపీఎల్ తొలి సీజన్
భారత మహిళా క్రికెట్ అభివృద్ధిలో సోమవారం మరో మైలురాయి చేరింది. బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుందని బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం వెల్లడించారు. రూ. 951 కోట్ల బిడ్ తో వయాకామ్ 18 హక్కులు సొంతం చేసుకుందన్నారు. ఇది 2023-27 కాలానికి ఒక్కో మ్యాచ్‌కి రూ 7.09 కోట్లు అని చెప్పారు. ఇదే వయాకామ్ 18 పురుషుల ఐపీఎల్ డిజిటల్ హక్కులను కూడా పొందింది. అలాగే, దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ ఏ టీ20 లీగ్‌ని కూడా ప్రసారం చేస్తోంది.
కాగా, ఈ ఏడాది మార్చిలో ఐదు జట్లతో మొదలయ్యే ఆరంభ మహిళల ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది. ఈనెల 25న లీగ్ ఫ్రాంచైజీల కోసం వేలాన్ని నిర్వహిస్తుంది. పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ యాజమాన్య మాంచెస్టర్ యునైటెడ్ గ్రూప్ కూడా ఓ జట్టును సొంతం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరగనున్న ఆటగాళ్ల వేలం కోసం క్రికెటర్లు ఈ నెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి గడువు ఇచ్చారు.