ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం
- ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను సుప్రీంలో సవాల్ చేసిన సీబీఐ
- కేసులో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన
- జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు
వైఎస్ వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో నిందితుడి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్ ను కూడా అక్కడికే బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ హత్య కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉన్నాడు. నిందితుడికి బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ సవాల్ చేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
నిందితుడి బెయిల్ రద్దు అంశంపై నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టుకు వదిలేస్తున్నట్లు పేర్కొంది. వివేకా హత్య కేసుతో పాటే నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్ ను విచారించాలని ఆదేశించింది. కేసులోని మెరిట్స్ ను పరిశీలించి, నిందితుడి బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు, ఈ నెల 5న గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిశాయి. తీర్పును జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ చేసింది.