ఈ నెల 27 నుంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ కు టీప్లస్1 సెటిల్ మెంట్: సెబీ ప్రకటన

  • విక్రయించిన షేర్లకు నగదు మరుసటి ట్రేడింగ్ రోజు జమ
  • అతి తక్కువ మార్కెట్ విలువ కలిగిన వాటికి ఇప్పటికే ఈ విధానం
  • మిగిలిన కంపెనీలు కూడా అతి త్వరలో వచ్చే అవకాశం
అన్ని లార్జ్ క్యాప్, బ్లూచిప్ స్టాక్స్ కు ఈ నెల 27 నుంచి టీ ప్లస్ 1 సెటిల్ మెంట్ విధానం అమలు కానుంది. ఇప్పటి వరకు కేవలం కొన్ని కంపెనీలే టీప్లస్1 సెటిల్ మెంట్ కు మారడం గమనార్హం. టీప్లస్1 సెటిల్ మెంట్ విధానం వల్ల ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన షేర్లు మరుసటి ట్రేడింగ్ రోజే ఖాతాలో జమ అవుతాయి. విక్రయించిన షేర్లకు నగదు మొత్తం మరుసటి ట్రేడింగ్ రోజు జమ అవుతుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మాదిరి రెండు రోజుల పాటు వేచి చూడక్కర్లేదు. 

టీ ప్లస్ 1 సెటిల్ మెంట్ విధానానికి మళ్లుతున్నట్టు 2021 నవంబర్ 8న స్టాక్ ఎక్సేంజ్ లు, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు ప్రకటించడం తెలిసిందే. అంతకుముందు సెప్టెంబర్ 7న సెబీ దీనిపై ప్రకటన చేసింది. 

2025 ఫిబ్రవరి 25 నుంచి దీని అమలు మొదలైంది. అతి తక్కువ మార్కెట్ విలువ ఉన్న వాటికి ముందుగా టీప్లస్1 సెటిల్ మెంట్ అమలు చేస్తున్నారు. ప్రతీ నెలా చివరి శుక్రవారం అతి తక్కువ మార్కెట్ విలువ కలిగిన 500 స్టాక్స్ ను టీప్లస్1 కిందకు మారుస్తున్నారు. 2002 ఏప్రిల్ 1న ఈక్విటీ మార్కెట్లలో టీప్లస్ 3 విధానం స్థానంలో టీ ప్లస్ 2 విధానం అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీప్లస్1 అమల్లోకి వస్తోంది.


More Telugu News