టాటా ఇండికా కారు వచ్చి 25 ఏళ్లు.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్

  • 1998లో మార్కెట్లోకి వచ్చిన టాటా ఇండికా
  • 25 సంవత్సరాల సంబరాల్లో పాల్గొన్న రతన్ టాటా
  • ఇండికాతో దిగిన ఫొటోలను పంచుకున్న రతన్
భారత వాహన దిగ్గజం టాటా మోటార్స్ రూపొందించిన టాటా ఇండికా కారు మన దేశంలో ప్యాసింజర్ కార్ల సెక్టార్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 1998లో ఇండికాను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. చిన్న కార్ల శ్రేణిలో విడుదలైన అనతికాలంలోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇండికా కారుకు విడుదలై 25 ఏళ్లు అయిన సందర్భంగా టాటా సంస్థ సంబరాలు చేసుకుంది. ఆ సంస్థ అధినేత రతన్ టాటా ఆ మోడల్ పై తనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. 

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 25 సంవత్సరాల క్రితం టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది అన్నారు. ఇది మధురమైన జ్ఞాపకాలను తనకు గుర్తుచేస్తుందని చెప్పారు. తన హృదయంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ఇండికా 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేశారు. కారును మార్కెట్లోకి విడుదల చేస్తున్నప్పటి ఫొటోలను షేర్ చేశారు.


More Telugu News