అణ్వాయుధాలు క‌లిగిన మనం ఇతర దేశాలను అప్పు అడగడం సిగ్గుచేటు: పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ ష‌రీఫ్‌

  • నానాటికీ పతనమవుతున్న పాక్ ఆర్థిక పరిస్థితి
  • దేశ పరిస్థితిపై పాక్ ప్రధాని ఆవేదన
  • తీసుకున్న అప్పులను తీర్చక తప్పదని వ్యాఖ్య
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ నానాటికీ పతనమవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అప్పు పుడితే తప్ప గడవలేని పరిస్థితి అక్కడ నెలకొంది. దేశ ఆర్థిక పరిస్థితిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు అప్పులు చేయడం సరి కాదని అన్నారు. తీసుకున్న రుణాలను తీర్చక తప్పదని చెప్పారు. 

అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్ డబ్బుల కోసం ఇతర దేశాల వద్ద చేయి చాచడం సిగ్గుచేటని అన్నారు. ఇటీవల తాను యూఏఈకి వెళ్లినప్పుడు అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ పాకిస్థాన్ కు వంద కోట్ల డాలర్లను అప్పుగా ప్రకటించారని వెల్లడించారు. పాక్ కు ఆర్థిక సాయం చేసిన సౌదీ అరేబియాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ కు చెందిన ఒక కార్యక్రమానికి షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News