'ది కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'కాంతార' బ్యూటీ
- 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వివేక్ అగ్నిహోత్రి
- కరోనాపై ఇండియా పోరాటం కథాంశంగా చిత్రం
- సప్తమి గౌడకు ఆఫర్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి
ఏమాత్రం అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై, అఖండ విజయాన్ని సాధించిన చిత్రం 'కాంతార'. రిషభ్ శెట్టి స్వీయదర్శకత్వం వహిస్తూ నటించిన ఈ కన్నడ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడకు మంచి పేరొచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడామె ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది.
బాలీవుడ్ లో 'ది కశ్మీర్ ఫైల్స్' సెన్సేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పుడు ఆయన 'ది వ్యాక్సిన్ వార్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సప్తమి గౌడకు తన చిత్రంలో వివేక్ ఆఫర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ... ఎంతో టాలెంట్ ఉన్న యువ నటి సప్తమి అని ప్రశంసించారు. ఆమెను తమ చిత్రంలో తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మన దేశంలో ప్రతిభ ఉన్న నటులకు అవకాశం ఇవ్వడం తమ లక్ష్యమని చెప్పారు.
కోవిడ్ పై మన దేశం ఎలా పోరాడిందనేదే 'ది వ్యాక్సిన్ వార్' సినిమా కథాంశం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఏకంగా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, భోజ్ పురి, బంగ్లా భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.