వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విశాఖలో అపూర్వ స్వాగతం
- ఢిల్లీ నుంచి వర్చువల్‌గా రైలును ప్రారంభించిన మోదీ
- విశాఖలో జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం
- రైలుపై పూల వర్షం కురిపించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిన్న ఉదయం బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విశాఖపట్టణంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు. రాత్రి 10.45 గంటలకు విశాఖ చేరుకున్న రైలుకు రైల్వే అధికారులు జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు రైలుపై పూల వర్షం కురిపించారు. అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అనకాపల్లి నుంచి విశాఖపట్టణం వరకు ఈ రైలులో ప్రయాణించారు.
ఇక, సికింద్రాబాద్‌లో జరిగిన రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందేభారత్ రైలులో మొత్తం 16 బోగీలు ఉన్నాయి. ఇందులో 14 చైర్ కార్లు కాగా, రెండు ఎగ్జిక్యూటివ్ బోగీలు. 1128 మంది ఒకేసారి ఈ రైలులో ప్రయాణించవచ్చు.