నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడిన లిఫ్ట్.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న అజిత్ పవార్

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లిన అజిత్ పవార్
  • ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో పవార్‌తోపాటు 90 ఏళ్ల వైద్యుడు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో ముగ్గురితో కలిసి అజిత్ పవార్ నాలుగో అంతస్తులో లిఫ్ట్ ఎక్కగా, అది ఒక్కసారిగా వేగంగా కిందికి జారి పడింది.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూణెలోని హార్దికర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. 

బారామతిలో తాను ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు అజిత్ పవార్ తెలిపారు. ప్రమాద సమయంలో తనతోపాటు 90 ఏళ్ల వైద్యుడు డాక్టర్ రెడీకర్, పోలీసులు కూడా లిఫ్ట్‌లో ఉన్నట్టు చెప్పారు. తాము లిఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ వెంటనే లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి వేగంగా కిందపడిందని వివరించారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. 

ఆ తర్వాత లిఫ్ట్ డోర్‌ను బద్దలుగొట్టడంతో తామంతా సురక్షితంగా బయటపడినట్టు తెలిపారు. ప్రమాదం విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు. లేదంటే నిన్ననే ఈ విషయం బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.


More Telugu News