కరోనా కొత్త వేరియంట్ల విజృంభణ... తాజా మార్గదర్శకాలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ
- పలు దేశాల్లో ఇంకా తగ్గని కరోనా ఉద్ధృతి
- లక్షణాలు ఉంటే 10 రోజుల ఐసోలేషన్
- లక్షణాలు లేకుండా పాజిటివ్ వస్తే 5 రోజుల ఐసోలేషన్
- బూస్టర్ డోసు తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్ఓ
మూడేళ్లుగా ప్రపంచ మానవాళిని భయాందోళనలకు గురిచేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటికీ పలు దేశాల్లో తీవ్రస్థాయిలో కొనసాగుతుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. కొన్నిదేశాల్లో సాధారణ పరిస్థితులు ఉండగా, మరికొన్ని దేశాల్లో కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. దాంతో మరో కరోనా వేవ్ అంశం చర్చకు వస్తోంది.
ఈ నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా పాజిటివ్ వచ్చిన బాధితుల్లో లక్షణాలు కనిపిస్తే వారు 10 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోతే 5 రోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలి. బాధితుడికి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే ఐసోలేషన్ నుంచి బయటికి రావొచ్చు. పరిస్థితులతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కరోనా రోగుల చికిత్సలో నిర్మాట్రెల్విర్-రిటోనావిర్ ఔషధాల వినియోగాన్ని కొనసాగించాలని పేర్కొంది. అంతేకాదు, కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
ఇటీవల కరోనా కొత్త వేరియంట్లు పలు దేశాల్లో వెలుగు చూడడం కూడా డబ్ల్యూహెచ్ఓను అప్రమత్తం చేసింది. చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ తో పాటు పలు దేశాల్లో ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ అత్యధిక కేసులకు కారణమవుతోంది.