విదేశీ గడ్డపై ఆర్ఆర్ఆర్ హవా... మరో అవార్డు అందుకున్న కీరవాణి
- అమెరికాలో ఆర్ఆర్ఆర్ మేనియా
- ఇటీవల 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
- తాజాగా లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
- ఉత్తమ సంగీతం కేటగిరీలో పురస్కారం
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వ నైపుణ్యానికి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటనా ప్రతిభకు మచ్చుతునకలా నిలిచిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కుంభవర్షం కురిపించిన ఈ చిత్రం అవార్డుల పరంగానూ దూసుకెళుతోంది.
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల రిమైండర్ జాబితాలో చోటుదక్కించుకున్న ఆర్ఆర్ఆర్ కు అమెరికాలో నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రంలో 'నాటు నాటు' పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించడం తెలిసిందే. తాజాగా బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు కూడా వరించింది.
ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. కీరవాణికి అభినందనలు తెలిపింది.