ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు రంజీ మ్యాచ్ లో ఆడాలని జడేజా నిర్ణయం
- గతేడాది ఆసియా కప్ సందర్భంగా గాయపడిన జడేజా
- తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక
- జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న జడేజా
గాయంతో ఇటీవల టీమిండియాకు దూరమైన రవీంద్ర జడేజా మళ్లీ జట్టులోకి రావడం తెలిసిందే. త్వరలో ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే టెస్టు సిరీస్ కోసం జడేజా ఎంపికయ్యాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 17 మంది జట్టు సభ్యుల్లో జడేజా కూడా ఉన్నాడు.
కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న జడేజా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్నాడు. అయితే, ఫిట్ నెస్, మ్యాచ్ ప్రాక్టీసు కోసం రంజీ బరిలో దిగాలని జడ్డూ భావిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరగనుండగా, ఈ లోపు సౌరాష్ట్ర జట్టు తరఫున ఒక రంజీ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
దీనిపై సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జైదేవ్ షా స్పందించారు. సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడితే బాగుంటుందని, అతడు ఆడుతున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం అంతకుమించి సమాచారం లేదని పేర్కొన్నారు.
గతేడాది ఆగస్టులో ఆసియా కప్ సందర్భంగా గాయపడిన జడేజా అప్పటి నుంచి క్రికెట్ బరిలో దిగలేదు. కోలుకున్న జడేజా బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో గత కొన్ని వారాలుగా బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు.