సునామీలా ముంచెత్తిన మంచు.. అవలాంచి వీడియో ఇదిగో!

  • కశ్మీర్ లోని సోనామార్గ్ లో భయానక ద‌ృశ్యం
  • వారంలో ఇది రెండో అవలాంచి అని వెల్లడించిన అధికారులు
  • మంచు తుపానులో చిక్కుకున్నోళ్లంతా క్షేమంగా ఉన్నారని వివరణ
జమ్మూకశ్మీర్ లోని ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్ ను అవలాంచి ముంచెత్తింది. సునామీలా మంచు ముంచెత్తింది. రెండు వైపుల నుంచి భారీగా మంచు దూసుకొస్తుంటే జోజిలా టన్నెల్ పనుల్లో ఉన్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. తమ బ్యారక్ లలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఈ భయంకర అనుభవాన్ని జోజిలా టన్నెల్ పనులు చేస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీ జనరల్ మేనేజర్ హర్ పాల్ సింగ్ తన కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటనలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని హర్ పాల్ వివరించారు.

జోజిలా టన్నెల్ పనులు చేపట్టిన కన్ స్ట్రక్షన్ కంపెనీ తన కార్మికుల కోసం సోనామార్గ్ లో కొన్ని బ్యారక్ లు నిర్మించింది. శనివారం ఈ బ్యారక్ లలో ఉన్న కార్మికులు ఎప్పటిలానే తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో మేఘాలు నేలపై వాలినట్లు మంచు దూసుకురావడం గమనించి ఆందోళన చెందారు. రెండు వైపులా మంచు దూసుకొస్తుంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్యారక్ లలోకి పరుగులు పెట్టారు. తుపాను శాంతించే దాకా భయంభయంగానే గడిపారు. అవలాంచి బ్యారక్ లను దాటి వెళ్లిపోయాక అక్కడంతా మంచు పేరుకు పోయిందని హర్ పాల్ సింగ్ వివరించారు.


More Telugu News