సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న 'వందేభారత్' ఎక్స్ ప్రెస్
- తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు
- సంక్రాంతి కానుకగా రైలును రేపు వర్చువల్ గా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
- సికింద్రాబాద్, విశాఖ నగరాల మధ్య తిరగనున్న వందేభారత్ రైలు
దేశంలో అత్యంత వేగగామి అయిన వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రేపు సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య తిరిగే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ రేపు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ వందేభారత్ రైలు ఆదివారం తప్ప వారంలో ఆరు రోజులు తిరుగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖ నుంచి బయల్దేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు 20833 నెంబరు కేటాయించగా, సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ రైలుకు 20834 నెంబరు కేటాయించారు. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గరిష్ఠంగా 180 కిమీ వేగాన్ని అందుకున్నప్పటికీ, దేశంలోని ట్రాక్ లను దృష్టిలో ఉంచుకుని దీన్ని 160 కిమీ వేగంతో నడపనున్నారు.