మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- రేపు సంక్రాంతి
- ఓ ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
- సంక్రాంతి విశిష్టతను వివరించిన జనసేనాని
సృష్టి, స్థితి, లయ కారకుడైన సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పుణ్య సమయం మకర సంక్రాంతి అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పక్షాన, జనసేన పక్షాన సర్వజనులకు, ముఖ్యంగా తనకు ఎంతో ప్రీతిపాత్రమైన తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.
సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతి ఫలసాయాల మేలు కలయికే మన సంక్రాంతి అని అభివర్ణించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల ఆశీర్వచనాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నింగిని తాకాలనుకునే పతంగులు, కోడి పందాలు, పశుజాతి ప్రదర్శనలు, కొత్త బట్టలు, నోరూరించే పిండివంటలతో మూడు రోజుల పాటు ఆబాలగోపాలాన్ని అలరిస్తాయని పవన్ కల్యాణ్ వివరించారు.
తెలుగుజాతికి గర్వకారణమైన ఈ సంక్రాంతి ఆచంద్రార్కం వర్ధిల్లాలని, మన సంస్కృతికి పట్టగొమ్మగా విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు సిరిసంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.