అప్పుడే సంపూర్ణ సంక్రాంతి: కేసీఆర్
- దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ప్రతి కుటుంబం సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్ష
- దేశ వ్యాప్తంగా వ్యవసాయం పండగ అయినప్పుడే సంపూర్ణ సంక్రాంతి అని వ్యాఖ్య
దేశ, రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతిని ప్రజలంతా సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరుకునే సమయంలో జరుపుకునే పండుగ సంక్రాంతి అని... భూతల్లికి రైతులు కృతజ్ఞతలు తెలుపుకునే రోజని చెప్పారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబం సిరిసంపదలతో తులతూగాలని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో సాగు దండగ అన్నారని... ఇప్పుడు అదే సాగు పండగ అయిందని చెప్పారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి యావత్ దేశానికే మార్గదర్శకమని అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం పండగ అయినప్పుడే సంపూర్ణ సంక్రాంతి అని చెప్పారు. వ్యవసాయరంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.