నాటు నాటు పాటకు గమ్మత్తైన ట్విస్ట్ ఇచ్చిన జైపూర్ పోలీసులు
- నాటు నాటు ను నో టు నో టు అని మార్చిన వైనం
- మద్యపానానికి నో చెప్పాలంటూ ప్రచారం
- ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటో వైరల్
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ దక్కింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఇటీవలే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఆస్కార్ పురస్కారానికి కూడా ఈ పాట నామినేట్ అయింది. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ పాటను జైపూర్ పోలీసులు వినూత్నంగా ఉపయోగిస్తున్నారు. నాటు నాటు పాటను డ్రంక్ అండ్ డ్రైవ్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ప్రచారానికి ఉపయోగించారు.
ఆ పాటలో ఎన్టీఆర్, చరణ్ సిగ్నేచర్ స్టెప్ ఫొటో కింద ‘సే నో టు నో టు డ్రింకింగ్ వైల్ డ్రైవింగ్’ (డ్రంక్ అండ్ డ్రైవ్ కు నో చెప్పండి) అని క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్ లో షేర్ చేశారు. గోల్డన్ గ్లోబ్ నెగ్గిన ఆర్ఆర్ఆర్ కి గ్లాస్ ఎత్తి చీర్స్ చెప్పండి.. కానీ, మందు గ్లాసు కారులో ఉండకుండా చూడండి అని పేర్కొన్నారు. ఇప్పుడీ పోస్ట్ ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ట్విట్టర్ వినియోగదారులు పోలీసు శాఖ సృజనాత్మకతను ప్రశంసించారు.