చైనాలో 90 కోట్ల మందికి కరోనా

  • ఈ నెల 11 నాటికి 90 కోట్ల మందికి కరోనా
  • దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్
  • కరోనా కొత్త వేవ్ మరో మూడు నెలలు కొనసాగే అవకాశం
చైనాలో కరోనా పంజా విసురుతోంది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్ సోకింది. ఈ నెల 11 నాటికి 90 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారని పెకింగ్ యూనివర్శిటీ వెల్లడించింది. గాన్సూ ప్రావిన్స్ లో 91 శాతం మందికి కరోనా సోకిందని తెలిపింది. యునాన్ ప్రావిన్స్ లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్ లో 80 శాతం మంది వైరస్ బారిన పడ్డారు. 

మరోవైపు ఈ నెల 23న చైనా కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కరోనా కొత్త వేవ్ మరో రెండు నుంచి మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ చీఫ్ జెంగ్ గువాంగ్ తెలిపారు.


More Telugu News