వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ప్రధానికి క్లాస్ తీసుకున్న పుతిన్
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పుతిన్
- ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ పై ఆగ్రహం
- నిధుల బదలాయింపుపై నిలదీసిన పుతిన్
- పిచ్చిచేష్టలు చేస్తున్నావా అంటూ ఫైర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన క్యాబినెట్ సహచరుడిపైనే చిందులు తొక్కిన ఘటన వెల్లడైంది. కొన్నిరోజుల కిందట రష్యా అధ్యక్ష కార్యాలయం ఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. దేశాధ్యక్షుడు పుతిన్, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్... ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ పై మండిపడ్డారు.
పుతిన్ క్యాబినెట్లో మంటురోవ్ పరిశ్రమల శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు, రష్యా రక్షణ రంగ పరికరాల సరఫరా బాధ్యతలు కూడా ఆయనే మోస్తున్నారు. ఇటీవల కాలంలో మంటురోవ్ పనితీరు ఆశాజనకంగా లేదంటూ పుతిన్ అసంతృప్తితో ఉన్నారు.
రష్యా విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ కు సివిల్, మిలిటరీ విమానాలు లీజుకు తీసుకునేందుకు 2.21 బిలియన్ డాలర్లను కేటాయించే శాఖ డెనిస్ మంటురోవ్ పర్యవేక్షిస్తున్నారు. అయితే, అటువైపు నుంచి శాఖాపరమైన అనుమతులు రాకపోవడం పుతిన్ ను చిర్రెత్తించింది.
వీడియో కాన్ఫరెన్స్ లో మంటురోవ్ మాట్లాడుతూ, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో హెలికాప్టర్ ఇంజిన్ల తయారీ పరిశ్రమ స్థాపిస్తున్నట్టు తెలిపారు. అయితే, పుతిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి చాలా సమయం ఉంది... ఏరోఫ్లోట్ సంస్థకు నిధులు ఎందుకు కేటాయించలేదని అడుగుతున్నా అంటూ మంటురోవ్ పై మండిపడ్డారు.
"కాంట్రాక్టుపై ఎలాంటి సంతకాలు జరగలేదు, డైరెక్టర్లు నాకు అంతా చెప్పారు... ఏం, పిచ్చిచేష్టలు చేస్తున్నావా? కాంట్రాక్టుపై సంతకాలు ఎప్పుడు జరుగుతాయి? అంటూ మంటురోవ్ ను గట్టిగా నిలదీశారు. 700 విమానాలు, హెలికాప్టర్లు రక్షణశాఖతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలియదా? ఇది అత్యావశ్యకమైన విషయం... ఈ కాంట్రాక్టు విషయం నెలరోజుల్లో ఓ కొలిక్కిరావాలి" అంటూ పుతిన్ హెచ్చరించారు.