'వాల్తేరు వీరయ్య' పండక్కి పర్ఫెక్ట్ సినిమా అంటున్నారు: డైరెక్టర్ బాబీ
- నేడే విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
- మాస్ హీరోలుగా తెరపై సందడి చేసిన చిరూ - రవితేజ
- ఈ సినిమా తనకి గౌరవం తెచ్చిందన్న బాబీ
- థియేటర్స్ రెస్పాన్స్ పట్ల సంతోషం
పూర్తి మాస్ లుక్ తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమే అయింది. మాస్ రోల్స్ అనగానే వాటిపై చిరంజీవి మార్కు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. మాస్ రోల్స్ లో చిరంజీవి చేసే కామెడీని .. స్టెప్పులను .. ఆ తరహా పాత్రలలో ఆయన బాడీ లాంగ్వేజ్ ను చూడటానికి అంతా ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి చిరంజీవి పక్కా మాస్ లుక్ తో చేసిన 'వాల్తేరు వీరయ్య' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.
ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోందంటూ, కొంతసేపటి క్రితం 'మాస్ బ్లాక్ బస్టర్ మీట్' ను నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. "ఈ సినిమా థియేటర్స్ కి వెళ్లాము .. అక్కడి రెస్పాన్స్ చూసిన తరువాత, మేము పడిన కష్టాన్ని మరిచిపోయాము. ఇంతకుముందు తీసిన సినిమాలకు నాకు పేరు మాత్రమే వచ్చింది. ఈ సినిమా వలన నాకు గౌరవం వచ్చింది" అని అన్నాడు.
"నేను అనుకున్నట్టుగానే ఈ సినిమా పూనకాలు తెప్పిస్తోంది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై మాకు నమ్మకం కలగడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్. అందరూ కూడా సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు లైఫ్ ఇచ్చిన రవితేజ గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా నాకు కాల్ చేసి, పండక్కి ఇది పెర్ఫెక్ట్ సినిమా అంటూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.