ఆ మహిళే మూత్ర విసర్జన చేసింది... నేను కాదు: ఎయిరిండియా కేసులో కోర్టుకు తెలిపిన ప్రయాణికుడు
- ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన
- శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడి అరెస్ట్
- కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్
ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. పోలీసులు శంకర్ మిశ్రాను అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు.
విచారణ సందర్భంగా శంకర్ మిశ్రా... ఆ ప్రయాణికురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని స్పష్టం చేశారు. ఆమె సీటు క్యాబిన్ మూసివేసి ఉండగా, తానెలా మూత్రవిసర్జన చేస్తానని న్యాయమూర్తికి తెలిపారు. ఆ ప్రయాణికురాలే మూత్ర విసర్జన చేసిందని అన్నారు.
ఆమె కథక్ డ్యాన్సర్ అని, 80 శాతం మంది కథక్ డ్యాన్సర్లు మూత్రం ఆపుకోలేని సమస్యతో బాధపడుతుంటారని శంకర్ మిశ్రా న్యాయవాది కోర్టుకు వివరించారు. తన క్లయింటు ఆమె కూర్చున్న సీటు వైపు వెళ్లాలంటే వెనుకనుంచే వెళ్లాలని, అలాంటి పరిస్థితుల్లో మూత్రం సీటు ముందుభాగం వరకు ఎలా వెళుతుంది? అంటూ న్యాయవాది సందేహం వెలిబుచ్చారు. పైగా ఆమె వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కూడా తన క్లయింటు గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రాను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా పై వాదనలు చోటుచేసుకున్నాయి.