సంక్రాంతికి ముందు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో జోష్
- 303 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 98 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సంక్రాంతికి ముందు సెషన్ లో మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. మధ్యాహ్నం వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. అమెరికా సహా భారత్ లో ద్రవ్యోల్బణం తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 60,261కి పెరిగింది. నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 17,956 వద్ద స్ధిరపడింది. మెటల్, టెక్, పవర్, ఐటీ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.03), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.00), ఇన్ఫోసిస్ (1.55), అల్ట్రాటెక్ సిమెంట్ (1.43), ఐసీఐసీఐ బ్యాంక్ (1.40).
టాప్ లూజర్స్:
టైటాన్ (1.14), నెస్లే ఇండియా (0.44), ఎల్ అండ్ టీ (0.30), యాక్సిస్ బ్యాంక్ (0.29), ఐటీసీ (0.26).