పవన్ కల్యాణ్ రూ.1,800 కోట్లు హవాలా చేస్తూ దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది: మంత్రి దాడిశెట్టి రాజా
- పవన్ ను టార్గెట్ చేసిన ఏపీ మంత్రులు
- పవన్ హవాలాపై కేంద్రం వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్న రాజా
- పవన్ కాపులను చంద్రబాబుకు అప్పగించాడని వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కూడా చేరారు. పవన్ కల్యాణ్ ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని దాడిశెట్టి రాజా అన్నారు. కాపులను పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించాడని విమర్శించారు. ఇలాంటి శునకాలు చంద్రబాబు వద్ద చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ పేరెత్తే అర్హత పవన్ కల్యాణ్ కు లేదని, గతంలో వైఎస్సార్ దెబ్బకు ప్రజారాజ్యం తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడు సీఎం జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పట్టడం ఖాయమని దాడిశెట్టి రాజా అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రూ.1,800 కోట్లు పోలెండ్ కు హవాలా చేస్తూ కేంద్రానికి దొరికిపోయాడని ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కేంద్రం వద్ద ఉన్నాయంటూ రెండు మూడు నెలల నుంచి ప్రచారం జరుగుతోందని వివరించారు.
భీమ్లానాయక్ సినిమాను అడ్డుకోవడం వల్ల రూ.30 కోట్లు పోయాయని పవన్ అంటున్నారని, ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులే రూ.20 కోట్లు దాటకపోతే, రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుందని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. నాసిరకం సినిమాను ప్రజలు చూడకపోతే, అందుకు ప్రభుత్వం ఏంచేస్తుందని అన్నారు. తక్కువ బడ్జెట్ లో వచ్చిన కాంతార ఏ విధంగా హిట్టయ్యిందో అందరూ చూశారని తెలిపారు.