'ఒక్కడు' కోసం ఛార్మినార్ సెట్ వేయడానికి ఎంత ఖర్చు అయిందంటే..!: నిర్మాత ఎమ్మెస్ రాజు
- 2003 జనవరి 15న వచ్చిన 'ఒక్కడు'
- ఎల్లుండితో 20 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సినిమా
- ఛార్మినార్ సెట్ కి 2 కోట్లకి పైగా ఖర్చు
- మహేశ్ ఎదుగుదల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెస్ రాజు
మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఒక్కడు' ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఎమ్మెస్ రాజు నిర్మించారు. భూమిక కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీతో 20 ఏళ్లను పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఎమ్మెస్ రాజు మాట్లాడారు.
"మహేశ్ బాబుకి ముందుగా నేను ఒక కథను వినిపించాను. ఆ కథ బాగానే ఉందిగానీ .. తనకి వర్కౌట్ కాదని ఆయన అన్నాడు. అలా ఆయన కాదన్న సినిమానే 'మనసంతా నువ్వే'. 'గుణశేఖర్ గారి దగ్గర ఒక కథ ఉంది .. వినండి' అని మహేశ్ బాబు అన్నాడు. ముగ్గురం కలిసి ఆ కథపై కూర్చున్నాము. ఫైనల్ గా ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాము .. ఆ కథనే 'ఒక్కడు' అన్నారు.
" ఈ సినిమా కథ ఛార్మినార్ తో ముడిపడి ఉంటుంది. అందువలన ఉదయాన్నే ఛార్మినార్ దగ్గర షూటింగు పెట్టుకుందామని మహేశ్ బాబు అన్నాడు. అప్పటికి 'మనసంతా నువ్వే' హిట్ కావడంతో బాగా లాభాలు వచ్చాయి. అందువలన ఛార్మినార్ సెట్ వేద్దామని అన్నాను. అప్పట్లోనే ఆ సెట్ కి 2 కోట్లకి పైగా అయింది. ఈ 20 ఏళ్లలో మహేశ్ సూపర్ స్టార్ గా ఎదగడం సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.