నిన్నటి వన్డేలో ప్రపంచ రికార్డును సాధించిన టీమిండియా.. చెత్త రికార్డును సొంతం చేసుకున్న శ్రీలంక
- ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలను నమోదు చేసిన భారత్
- వన్డేలు, టీ20లు కలిపి అత్యధిక ఓటమిలను సొంతం చేసుకున్న శ్రీలంక
- శ్రీలంకపై భారత్ కు 26వ సిరీస్ విజయం
నిన్న కోల్ కతాలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ ఒక ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలను నమోదు చేసిన దేశంగా భారత్ రికార్డు పుటల్లోకి ఎక్కింది.
శ్రీలంకపై వన్డేల్లో భారత్ కు ఇది 95వ విజయం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా 95 వన్డేల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ అంశంలో ఆస్ట్రేలియాతో సమంగా భారత్ నిలిచింది. మరోవైపు ఈ రికార్డులో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంకపై పాకిస్థాన్ 92 విజయాలను సాధించింది. ఇంకో వైపు ద్వైపాక్షిక సిరీస్ ల విషయానికి వస్తే శ్రీలంకపై ఇది 26వ సిరీస్ విజయం.
ఇంకోవైపు నిన్నటి వన్డే ఓటమితో శ్రీలంక ఒక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఓటమిలను మూటకట్టుకున్న జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు 437 వన్డే మ్యాచుల్లో శ్రీలంక ఓడిపోయింది. టీ20ల్లో 94 మ్యాచ్ లలో ఓటమిపాలయింది. దీంతో, ఈ రెండు ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచుల్లో ఓడిపోయిన అప్రతిష్టను మూటకట్టుకుంది. భారత్, శ్రీలంక మధ్య మూడో వన్డే ఆదివారం నాడు జరగనుంది.