వ్యాపారితో నగ్నంగా మాట్లాడి.. రూ. 2.69 కోట్లు కొట్టేసిన యువతి!
- రియాశర్మ పేరుతో వ్యాపారికి ఫోన్
- తియ్యని మాటలతో వ్యాపారిని పడేసిన యువతి
- నగ్నంగా వీడియో కాల్ చేసి అతడిని కూడా అలా మారమన్న యువతి
- ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్
- 11 మంది ఫోన్ చేసి రూ. 2.69 కోట్లు కొట్టేసిన వైనం
ఓ వ్యాపారికి ఫోన్ చేసి తియ్యని మాటలతో అతడిని బోల్తా కొట్టించిన ఓ యువతి ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసి ఏకంగా రూ. 2.69 కోట్లు కొట్టేసింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారికి గతేడాది ఆగస్టు 8న మోర్బికి చెందిన రియా శర్మ పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తియ్యని మాటలతో వ్యాపారిని తనవైపు తిప్పేసుకున్న ఆమె.. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసి అతడిని కూడా అలా మారమని చెప్పింది. ఆమె వలలో చిక్కుకున్న వ్యాపారి వెనకాముందు ఆలోచించకుండా అలాగే చేశాడు. అంతే, ఆ దృశ్యాలను రికార్డు చేసిన ఆమె ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది.
ఆ దృశ్యాలు బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో మరో గత్యంతరం లేని ఆయన ఆమె అడిగినంత సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ఢిల్లీ ఇన్‌స్పెక్టర్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. నగ్న వీడియో క్లిప్ తన వద్ద ఉందని బెదిరించి రూ. 3 లక్షలు వసూలు చేశాడు. ఆగస్టు 14న ఢిల్లీ సైబర్ సెల్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పి వీడియో కాల్ భయంతో రియాశర్మ ఆత్మహత్యకు యత్నించిందని పేర్కొంటూ వ్యాపారి వద్ద నుంచి రూ. 80.97 లక్షలు వసూలు చేశాడు.
ఆ తర్వాత మరికొన్ని రోజులకు సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి ఫోన్ చేసి రియాశర్మ తల్లి సీబీఐని ఆశ్రయించిందని, కేసు సెటిల్‌మెంట్ చేసుకోవాలనుకుంటే రూ. 8.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టాడు. దీంతో అతడు అడిగినంతా చెల్లించుకున్నాడు. ఈ లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగాయి.
ఈ క్రమంలో డిసెంబరు 15న కేసును మూసివేస్తున్నట్టు పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు పేరిట ఉత్తర్వులు వచ్చాయి. వాటిని చూసి అవి నకిలీవని గుర్తించిన బాధిత వ్యాపారి ఈ నెల 10న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు మొత్తం 11 మంది కాల్ చేసి రూ. 2.69 కోట్లు కాజేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.