నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 147 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 37 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన రిలయన్స్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈరోజు వెలువడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయి 59,958కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 17,858కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%), ఎల్ అండ్ టీ (1.66%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.62%), మారుతి (1.08%), నెస్లే ఇండియా (0.74%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-2.11%), యాక్సిస్ బ్యాంక్ (-1.54%), టాటా మోటార్స్ (-1.40%), కోటక్ బ్యాంక్ (-1.26%), భారతి ఎయిర్ టెల్ (-1.12%).


More Telugu News